మణుగూరు టౌన్, ఫిబ్రవరి 18 : ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ప్రధాన గేటు ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ.. సంస్థ లో కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం సీఈ బిచ్చన్నకు వినతిపత్రం అందజేశారు. కాం ట్రాక్టర్‌తో మాట్లాడి సోమవారంలోగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 3 నెలల పెం డింగ్ వేతనాలను విడుదల చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజేశ్ ఖన్నా బుధ వారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణభారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్‌లోని వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు.