హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,736 క్యూసెక్కులు వస్తుండగా, 63,647 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 879.79 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఇప్పడు 186.4214 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.