హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ విద్యపై శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై స్వల్పకాలిక చర్చలో ఆమె మాట్లాడారు. సర్కారు విద్యను కాంగ్రె స్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. బడ్జెట్లో 7.2 శాతం నిధులే కేటాయించారని, అవి ఏ మాత్రం సరిపోవని స్పష్టం చేశారు. సర్కారీ విద్య బలోపేతానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు.