హైదరాబాద్, మే28 ( నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం 81,831 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 30 వరకు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.