హైదరాబాద్ : నీరా కేఫ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గీత వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామన్నారు. నీరా ఆమ్మకంలో భాగంగా నీరా బాటిల్ల డిజైన్లను, లేబుల్స్‌ను పరిశీలించారు.
అనంతరం నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా నీరా కేఫ్ నిర్మాణ పనులను అబ్కారీ శాఖ డైరెక్టర్సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
నీరాను గౌడ వృత్తిదారులు మాత్రమే ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా సీఎం కేసీఆర్ అదేశాలు జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నీరా కేఫ్ లను నిర్మిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో అబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, దత్తరాజ్ గౌడ్, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఈఎస్‌లు సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, నవీన్, పవన్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.