హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): డోర్నకల్ జంక్షన్-భద్రాచలం రోడ్ మధ్య డబుల్ రైల్వే లైన్ నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులు మొదలుపెట్టనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ లైన్ పూర్తయితే భద్రాచలం ఆలయానికి వెళ్లేవారికి మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. డోర్నకల్ మీదుగా నడిచే రైళ్ల సంఖ్య పెరుగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం డోర్నకల్లో రైల్వే యార్డును రీ మోడల్ చేయడంతోపాటు అదనపు రైల్వే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.