భద్రాద్రి కొత్తగూడెం : గంజాయి(Ganja) కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు అంటూ.. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి(Constable Suicide attempt) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri district)బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గతంలో బూర్గంపాడు పోలీసు స్టేషన్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మాయమైంది. అయితే ప్రాపర్టీ పోతే ఎస్ఐని అడగకుండా నన్ను బాధ్యుడిని చేశారని సాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎస్ఐ సంతోశ్, నాని కలిసి యువకులతో గంజాయి అమ్మారు.. వాళ్లను పట్టుకు రమ్మని నా నంబర్ నుంచి ఫోన్ చేసినందుకు నాపైనే గంజాయి కేసు పెట్టారు అంటూ వాపోయాడు. అయితే ఈ కేసులో వారంతా తప్పించుకొని సాగర్ను బాధ్యుడిని చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ సాగర్ దసరా పండగ పూట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గంజాయి కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు అంటూ.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం – బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
గతంలో బూర్గంపాడు పోలీసు స్టేషన్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మాయమైంది. అయితే… pic.twitter.com/tvEiWmhpQZ
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024