‘సర్’ పేరిట ఓట్లు తొలగించే కుట్ర
‘సర్' పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్, జూన్ 23 : ‘సర్’ పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతోపాటు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరిట పశ్చిమబెంగాల్, ఛండీగడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో లక్షలాది ఓట్లు తొలగించారని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయి రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పకడ్బందీగాచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదుకోసం జిల్లా ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జి, మండలస్థాయి ఇన్చార్జిలతో పాటు బీఎల్ఏలను సైతం నియమించారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నమోదుకు కావాల్సిన పత్రాలు అందించి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి జగన్ మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

