హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఫీజు పథకంపై, స్కాలర్షిప్ బకాయిలపై ప్రభుత్వం పూటకో తీరుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఫీజు బకాయిలను సర్కార్ ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 7 ద్వారా డీబీటీ పద్ధతిలో విద్యార్థుల ఖాతాల్లో ఫీజును ఏఏ విడతల్లో విడుదల చేస్తుందో చెప్పాలని కోరారు. కళాశాలలకు ఫీజులను సకాలంలో వేయని సర్కార్.. విద్యార్థుల ఖాతాల్లో వేస్తుందన్న నమ్మకం లేదని తెలిపారు.