జనగామ, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్‌ల రాజకీయానికి తెరలేపిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని 27వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జైన రమేశ్ గెలుపుకోసం రైల్వేస్టేషన్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ గూండా, రౌడీ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఢీకొని గెలిచే సత్తాలేని కాంగ్రెస్ 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ టికెట్ ప్రకటించి బీఫామ్ ఇచ్చిన అభ్యర్థి బాల్దె అంజలిని కిడ్నాప్ చేసి ఆమె మెడపై కత్తిపెట్టి బెదిరించి బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
రెండు రోజులుగా ఆమె ఆచూకీ తెలియడం లేదని, దీనిపై జనగామ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ఇకడి కాంగ్రెస్ నా యకులు బీఆర్ఎస్ అభ్యర్థితోపాటు ఆమె అత్త మాజీ కౌన్సిలర్ కమలమ్మ, కు టుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేశారని తెలిపా రు. కాంగ్రెస్ కిడ్నాప్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.