సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 9: ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం’ అంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే నినదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ను అవమానించారంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో అంబేదర్ చౌరస్తాలోని జిల్లా గ్రంథాలయం ఎదుట కాంగ్రెస్ యూత్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ యూత్ నాయకుడు దేవరాజు గల్లాను ఓ హోంగార్డు పట్టుకొని లాగడం గొడవకు దారితీసింది. దీంతో అసహనానికి లోనైన ఆ పార్టీ నాయకులు, తామే అధికార పార్టీ నేతలమనే విషయాన్ని మరిచిపోయా రు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం’ అంటూ నినదించారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.