CM KCR | కాంగ్రెస్‌లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెసోళ్లది కొత్త మాట. నేను గ్యారంటీగా చెబుతున్న. ఇవాళ్టికి 74, 75 సభలు తిగిరాను. కాంగ్రెస్‌లో 15 మంది మోపయ్యారు. నేను ముఖ్యమంత్రి అంటే.. నేను ముఖ్యమంత్రి అంటున్నరు. వీళ్లు ముఖ్యమంత్రి అయ్యేది ఎన్నడూ ? కాంగ్రెస్ గెలిస్తేనే కదా? కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్నయ్యేది లేదు వట్టిదే గ్యాసు’ అన్నారు.
‘ముఖ్యమంత్రి అయితడని మోసపోయి ఓట్లు వేస్తే.. ఉన్న నరేందర్‌రెడ్డి పోతడు. మళ్లీ మొదటికే వస్తుంది కథ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాడు.. మన్నుగాడు. అది గ్యాసు. ఈ సారి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే స్థాయి పెరుగుతుంది.. ప్రమోషన్ వస్తుందని మనవి చేస్తున్నా. తప్పకుండా మీకు ఎక్కువ చేసే అవకాశం వస్తుంది. ఫాల్తు రేవంత్‌రెడ్డి మాటలు.. వాళ్లు ఇచ్చే మందుసీసాలు.. నోట్ల కట్టలకు ఏమాత్రం మోసపోవద్దు. రేవంత్‌రెడ్డికి నీతి లేదు. పద్ధతి లేదు. నియమం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడుతా అంటడు. ఇష్టం వచ్చిన గబ్బంతా మాట్లాడుతడు. ఇలాంటి వ్యక్తులేనా రాజకీయాల్లో ఉండాల్సింది. వీళ్లేనా కొడంగల్ గౌరవం కాపాడేది? నేను మిమ్మల్ని కోరేది.. ఏం కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. ఇంతకు ముందు మంచినీళ్లకు ఎంత గోస ఉండేది’ అన్నారు.
‘ఈ రోజు ప్రతి ఇంటికి నల్లాపెట్టి రోజు నల్లా నీరు ఇస్తున్నం. కరెంటు వస్తున్నది. రైతుబంధు సాయం వస్తున్నది. ఎవరైనా అమ్మాయి ప్రసవమైతే మునుపు ప్రైవేటు డాక్టర్లు దోపిడీ చేసేది. అమ్మ ఒడి వాహనాలు పెట్టి.. బాజాప్త మిమ్మల్ని తీసుకుపోయి పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేసి, మందులు ఇచ్చి.. వాహనంలో తీసుకొని వెళ్లి ప్రసవం చేయించి.. అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇచ్చి మీ ఇంటికాడ దించుతున్నారు. పేదింటి అమ్మాయిల పెళ్లి జరిగితే కల్యాణలక్ష్మి వస్తున్నది. కంటి వెలుగు కార్యక్రమం భారతదేశ చరిత్రలో విన్నరా? మూడుకోట్ల మంది కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చాం. కల్యాణలక్ష్మి ఎంత మందికి ఇచ్చాం. ఈ కాంగ్రెస్ దొంగలు ఇచ్చారా? వాళ్ల కాలంలో ఆలోచన చేశారా? సర్కారు దవాఖానలో మందులు లేకుండే. ప్రైవేటు దవాఖానల పొంటి తిరిగి కొంపలు ఆర్సుకున్నం. ఇక్కడ మీకు నరేందర్‌రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత తీసుకువచ్చిండు. వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ కింద సహాయం చేసిండు. రేవంత్‌రెడ్డి ఏకాన చేసిండా’ అంటూ ప్రశ్నించారు.