కవాడిగూడ, మార్చి 10 : ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహారదీక్షలో మంద కృష్ణ పాల్గొన్నారు. శాసనససభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని స్పష్టంచేశారు. వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే ఫలితాలు విడుదల చేయడం మాదిగలకు ద్రోహమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్యాయాన్ని ఎదుర్కొవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.