MLA Shankar | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): వెలమ కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై సొంత పార్టీలోని వెలమ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ కులాన్నే అవమానిస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్‌లోని వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు శం కర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరగణిస్తున్నట్టు తె లిసింది. ఎమ్మెల్యే శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌లోని వెలమ సామాజికవర్గానికి చెందిన ఎ మ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ సంజయ్, ప్రేమ్‌సాగర్‌రావు, మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితర నేతలు దీనిపై చర్చించుకున్న ట్టు తెలిసింది. శంకర్ వ్యాఖ్యలు తమకు ఎం తో ఇబ్బందిగా మారాయని, దీనిపై తమ కులస్థుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తున్నదని చెప్పినట్టు సమాచారం. శంకర్‌పై చర్యలు తీసుకుంటే తప్ప తమ కులస్థులు శాంతించే లా లేరని అన్నట్టు తెలిసింది.
దీంతో శంకర్‌కు పీసీసీ చీఫ్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు ఉం టాయా అన్నదానిపై మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే శంకర్ సమాధానం తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, పార్టీ నిర్ణయాన్ని బట్టి తమ ఆలోచన ఉంటుందని వెలమ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వెలమ సామాజికవర్గం భగ్గుమంటున్నది. శంకర్ మాటలపై అంతర్జాతీయ వెలమ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, దుబాయ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ వెలమసంఘాలు ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.
శంకర్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని, తమ సామాజికవర్గాన్ని దూషించిన శంకర్‌పై కఠినచర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండకు చెందిన శంకర్రావు, పీ యాదగిరిరావు, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు, తెలంగాణ గవర్నర్‌కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.