Talasani Srinivas Yadav | కేసీఆర్ ప్రభుత్వం అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : మాజీమంత్రి తలసాని
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ ( KCR ) పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ( Debt ) చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.

బీఆర్ఎస్ చేసిన అప్పులపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నిలదీస్తే ముఖ్యమంత్రి రేవంత్ బూతు బాష మాట్లాడుతున్నాడని విమర్శించారు.మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఓటర్ల జాబతా సవరణలో ( SIR) లో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హుల ఓట్లు తొలగింపు కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. .18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. ప్రజల అభిమానం, ఆదరణ పొందిన వారికే కార్పొరేషన్ ఎన్నికలలో అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు.
చర్చలకు సవాల్ చేసి హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రెండున్న రేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మిత్తీతో సహా తిరిగి చెల్లిస్తామని కాంగ్రెస్ను హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

