రామచంద్రాపురం, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిప డ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరాజుయాదవ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఐఎస్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి వీహెచ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కార్మికులంతా ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.