V Hanmanth Rao : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు (V Hanmanth Rao) తీవ్ర అసహనం వెలిబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏం ప్రభుత్వం ఇది’ అంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.
కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరుపైన.. సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపైన వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఓ పనికి సంబంధించి తాను, కోదండరెడ్డి స్వయంగా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా సిబ్బంది సరిగా స్పందించడం లేదని చెప్పారు.
రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ విహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఏం ప్రభుత్వం ఇది అంటూ కాంగ్రెస్ పాలనపై విహెచ్ అసంతృప్తి
రెవెన్యూ డిపార్ట్మెంట్, రేవంత్ రెడ్డి, పొంగులేటిపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు pic.twitter.com/m1ZGIZD6Q5
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024