Congress | ఆదిలాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను నాయకులు అమ్ముకున్నారని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ఆరోపించారు. గతంలో బీజేపీలో ఉండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకున్న కంది శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఆయన కోసం పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సోమవారం కార్యకర్తల సమావేశంలో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.