హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్నారు. అప్పులు చేసి అభివృ ద్ధి పనులు చేపట్టిన తమకు బిల్లులు రావడంలేదని సర్పంచులు, జీతాలు అందడంలేదని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆవేదనతో గుండెపోటుకు గురై ప్రా ణాలు వదులుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అలసత్వంతో జరుగుతున్న ఆత్మహత్యలు, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటి ని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నట్టు బీఆర్ఎస్ స్పష్టంచేసింది. వరుస విషాదాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోనే ఆరు నెలల జీతం అందక పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం సంచనలంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 52,221 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా గ్రామాల్లో పారిశుధ్య ని ర్వహణ, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డం పింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనా లు, వైకుంఠధామాల్లో వివిధ క్యాటగిరీల వారీ గా పనులు చేస్తున్నారు. వీరికి నెలకు ఇచ్చే రూ.8,500 వేతనం కూడా మూడు నెలలుగా అందడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో జూన్, జూలై, ఆగస్టు వేతనాలు అందకపోగా, మరికొన్ని పంచాయతీల్లో జూలై, ఆగస్టు జీతా లు రాలేదు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీతాల చెల్లింపు కూడా కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట.. నీటిమూటగానే మారిపోయిందని కార్మికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లు, కార్మికులు అనే తేడా లేకుండా అందరూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోనే ఇప్పటివరకు 13 మంది సర్పంచులు చనిపోయారు. వీరిలో నలుగురు బలవన్మరణాలకు పాల్పడగా, తొమ్మిది మంది వివిధ కారణాలతో మరణించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా చికితిపోయారు. ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోగా, మరో కాంట్రాక్టర్ అప్పుల ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనాలను కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ములుగు మున్సిపాలిటీలో జీతం రాలేదనే మనస్తాపంతో పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు 103 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లి శ్మశాన వాటికలో మైదం మహేశ్(30) పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవాడు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడే ప్రభుత్వం మ హేశ్‌కు రెండు నెలల వేతనం ఇవ్వలేదు.
అధికారులను అడిగినా సాంకేతిక సమస్య లు అంటూ దాటవేశారు. ములుగు మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా మూడు నెలలుగా వేతనం రాలేదు. జీతం రాక, కుటుంబం గడవక మహేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మహేశ్.. మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ బుధవారం మృతిచెందాడు. మహేశ్ కు భార్య, నలుగురు కుమార్తెలు కాగా, గతంలో ఒక కుమార్తె అనారోగ్యంతో చనిపోయింది. వేతనం అందక, కుటుంబాన్ని పోషించలేక మహేశ్ బలవన్మరణానికి పా ల్పడటం స్థానికంగా విషాదం నింపింది.
కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి. పెండింగ్ జీతాలు కూడా వెంటనే ఇవ్వాలి. ఏటా వినాయక చవితి ప్రారంభం నుంచి దసరా నవరాత్రులు ముగిసే వరకు పంచాయతీ కార్మికులపై తీవ్రమైన పని భారం ఉంటుంది. అదనపు పనికి అదనపు వేతనం చెల్లించకపోగా పండుగల సందర్భంగా ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తే ఎలాంటి పరిహారం చెల్లించడంలేదు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి. జీవో నంబర్ 51 సవరించాలి. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి.
-గ్యార పాండు, జీపీ వర్కర్స్ యూనియన్ నాయకుడు
సర్పంచులుగా పనిచేసిన మేం.. ప్రభుత్వ ఆదేశం మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అప్పులు తెచ్చిమరీ పనులు నిర్వహించాం. చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకపోవడం దారుణం. బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలొని మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు విడుదల చేసే వరకు సర్పంచుల సంఘం పోరాడుతుంది.
-గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
మాకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం కార్యాలయం ఎదుట ధర్నా చేశాం. మాకు రూ.121 కోట్ల బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశాం. అక్కడి వచ్చిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క మా వినతిని విన్నారు. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.
-గజ్జెల అంజిరెడ్డి, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు