సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు వ్యక్తం చేసిన ఆవేదనపై ఇప్పడు సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తున్నది.
ముఖ్యంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి కోడలిగా వచ్చిన ఓ మహిళ ఆవేదన ఎంతో మందిని కలవరపెడుతున్నది. పేదల ఇండ్లకే బఫర్ జోన్ వర్తిస్తుందా? మూసీ వెంబడి నిర్మించే ఆకాశ హర్మ్యాలకు వర్తించదా? అంటూ మొదలుపెట్టిన ప్రశ్నలు ఎంతో మంది మూసీ బాధితులను కదిలిస్తున్నాయి. ఇప్పుడీ అంశాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.