హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటివి ముందే ఊహించామని ‘ఎక్స్’లో తెలిపారు.
తెలంగాణలో స్కాంగ్రెస్కు నో చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఐటీ అధికారులు శుక్రవారం రూ.42 కోట్లు పట్టుకున్న నేపథ్యంలో కేటీఆర్ పైవిధంగా స్పందించారు.