Congress | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నామినేటెడ్ పోస్టుల్లో పైరవీలు, కాంట్రాక్టర్ల బిల్లుల సెటిల్మెంట్లతో ముఖ్యనేతకు సమాంతరంగా నయా పవర్ సెంటర్‌గా మారిన అధిష్ఠానం దూత వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేగింది. పార్టీనే నమ్ముకొని పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు దక్కకుండా చేసి, వలస కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు అమ్మకానికి పెట్టడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే తిష్టవేసిన అధిష్ఠానం దూత సమాంతర పాలన సాగిస్తున్న తీరును ఎత్తిచూపుతూ ‘దీపం ఉన్నప్పుడే చక్కబెట్టేద్దాం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై గాంధీభవన్ వర్గాలతోపాటు ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఆరాతీసినట్టు తెలిసింది. ఈ కథనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దిగువ శ్రేణి నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశాయి.
‘కాంగ్రెస్‌ను చంపేస్తారా?’ అంటూ గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను దా నికి జోడించారు. మరో వర్గం కాంగ్రెస్ శ్రేణులు ఒక వైపు నమస్తే కథనాన్ని, మరోవైపు ఓ కాం గ్రెస్ పార్టీ నేత ఫోటోను పెట్టి ‘ఆ.. ఆమ్మ వారు ఈ..అమ్మ వారే’ అంటూ..‘దీప ద్యూతం’ అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియా గ్రూప్‌ల్లోకి వదిలారు. గత నెలలో ఒక ప్రైవేట ఫంక్షన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. పార్టీలో సీనియర్లమైన తమను సంప్రదించకుండానే నిర్ణయా లు తీసుకుంటున్నారని మండిపడ్డారు . మరోసారి ఆ వ్యాఖ్యలను వైరల్ చేస్తూ ‘నమస్తే’ కథనాన్ని జోడించారు. ఇదిలా ఉండగా, అధిష్ఠా నం దూతలు కొప్పుల రాజు, దీపాదాస్మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ తదితరులు సోమవారం గాంధీభవన్‌లో ‘అంబేద్కర్ స మ్మాన్ సప్తాహ్’ కార్యక్రమం కార్యాచరణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులు అధిష్ఠానం దూతను ప్రశ్నించటానికి ప్రయత్నించగా.. సమావేశం ముగిసిందని వారు వెళ్లిపోవటం గమనార్హం.