హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నది. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అసమ్మతిని, అసంతృప్తులను తృప్తిపరిచేందుకు పార్టీ పదవులను ఎరగా వేయాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో సీనియర్లుగా ఉండి, మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డీసీసీ బాధ్యతలు అప్పగించి సంతృప్తి పరచాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వారికి పదవులు అప్పగించడం ద్వారా స్థానిక అవసరాలకు అవసరమైన నిధుల స మస్య కూడా తగ్గుతుందని ముఖ్యనేత ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా వలస కాంగ్రెస్ నేత పేరును పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. పఠాన్‌చెరు ప్రాంతానికి చెందిన సదరు నేత అవసరమైతే డబ్బు ఖర్చు చేయగలడనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.