Congress Candidates | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే రెండో జాబితాను ప్రకటించింది. 45 నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 100 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. అయితే, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్లకు టికెట్ నిరాకరించింది. ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు గద్ధర్ కూతురు వెన్నెల, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, రేవూరి ప్రకాశ రావు తదితరులకు రెండో జాబితాలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.
* సిర్పూర్: రావి శ్రీనివాస్,
* ఖానాపూర్ (ఎస్టీ): బొజ్ము వేడ్మా
* ఆదిలాబాద్: కంది శ్రీనివాస్ రెడ్డి,
* అసిఫాబాద్ (ఎస్టీ) : అజ్మీరా శ్యామ్ నాయక్,
* బోధ్ : వన్నెల అశోక్,
* ముధోల్ : బోస్లే నారాయణ రావు పటేల్,
* ఎల్లారెడ్డి : కే మదన్ మోహన్ రావు,
* నిజామాబాద్ రూరల్ : రేకులపల్లి భూపతి రెడ్డి,
* కోరుట్ల: జువ్వాది నర్సింగరావు,
* చొప్పదండి (ఎస్సీ) : మేడిపల్లి సత్యం,
* హుజూరాబాద్: వొడితెల ప్రణవ్,
* హుస్నాబాద్:పొన్నం ప్రభాకర్,
* సిద్దిపేట : పూజల హరికృష్ణ,
* నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి,
* దుబ్బాక: చెరుకు శ్రీనివాసరెడ్డి,
* కూకట్ పల్లి: బండి రమేష్,
* ఇబ్రహీం పట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి,
* ఎల్బీ నగర్: మధుయాస్కీ గౌడ్,
* మహేశ్వరం: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,
* రాజేందర్ నగర్: కస్తూరి నరేందర్,
* శేరిలింగంపల్లి : వీ జగదీశ్వర్ గౌడ్,
* తాండూర్ : బుయ్యాని మనోహర్ రెడ్డి,
* అంబర్ పేట్: రోహిన్ రెడ్డి,
* ఖైరతాబాద్: పీ విజయారెడ్డి,
* జుబ్లీ హిల్స్ : మహ్మద్ అజారుద్దీన్,
* సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) డాక్టర్ జీవీ వెన్నెల,
* నారాయణపేట్: డాక్టర్ పర్నిక చిట్టెంరెడ్డి,
* మహబూబ్ నగర్: యెన్నం శ్రీనివాస రెడ్డి,
* జడ్చర్ల : జే అనిరుద్ రెడ్డి,
* దేవరకద్ర : గవినోళ్ల మధుసూధన్ రెడ్డి,
* మక్తల్: వాకిటి శ్రీహరి,
* వనపర్తి: జి చిన్నారెడ్డి,
* దేవర కొండ (ఎస్టీ): నేనావత్ బాలూ నాయక్,
* మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
* భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి,
* జనగామ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి,
* పాలకుర్తి: యశస్విని మేమిడాల,
* మహబూబాబాద్: డాక్టర్ మురళీనాయక్,
* పరకాల: రేవూరి ప్రకాశ్ రెడ్డి,
* వరంగల్ వెస్ట్ : నాయిని రాజేందర్ రెడ్డి,
* వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ,
* వర్ధన్నపేట : కేఆర్ నాగరాజు,
* పినపాక: పాయం వెంకటేశ్వర్లు,
* పాలేరు:పొంగులేటి శ్రీనివాస రెడ్డి,
* ఖమ్మం : తుమ్మల నాగేశ్వరరావు.