హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డీలర్ల సమస్యలను పరిష్కరిస్తామని, క్వింటాల్ బియ్యంపై కమీషన్ను రూ.300లకు పెంచడంతోపాటు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.