Chevella Bus Accident | చేవెళ్ల బస్సు యాక్సిడెంట్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేకపోవడం వల్లనో.. కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లనో యాక్సిడెంట్ జరగదని తెలిపారు. ఇది రెగ్యులర్‌గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్పై యాక్సిడెంట్లు జరిగి చనిపోలేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మల్లు రవి మాట్లాడుతూ.. చేవెళ్లలో బస్సు యాక్సిడెంట్ జరిగి 19 మంది మరణించడం దురదృష్టకరమని మల్లు రవి అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్లు బాగోలేకపోవడం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో బాగుంది.. అయినా ఓఆర్ఆర్ మీద ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయని ప్రశ్నించారు. రోడ్డు మంచిగుందా.. మంచిగ లేదా అని దానివల్ల యాక్సిడెంట్లు జరగవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయారు.. మా ప్రభుత్వంలోనూ చనిపోయారని అన్నారు. దీన్ని సమర్థించడం లేదని.. జరగకుండా ఉండాలని అనుకుంటానని వివరించారు. కానీ ఈ చావులను రాజకీయాలకు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది రెగ్యులర్‌గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే అని స్పష్టం చేశారు.
ఎన్ని గారడీ విద్యలు చేసినా, మాయమాటలు చెప్పినా ప్రజలు మోసపోరని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. వాస్తవంగా ఏం జరుగుతుందో దాని ప్రకారమే ఓట్లు వేస్తారని తెలిపారు.