హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో 2010లో దేశంలోనే నంబర్ 2లో ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో 20వ స్థానానికి పడిపోయిందంటూ బీఆర్ఎస్పైనా, కేటీఆర్‌పైనా విమర్శలు గుప్పించా రు. వాస్తవం వేరేలా ఉంది.
హైదరాబాద్ మెట్రో బీఆర్ఎస్ హయాంలో 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. మరో విషయం ఏమిటం టే? దేశంలో ఉన్నవే 8 మెట్రో నగరాలు. అలాంటప్పుడు 20వ స్థానానికి ఎలా పడిపోయిందో ఆయనకే తెలియాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చామల వ్యా ఖ్యలపై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఆయ న అజ్ఞానాన్ని ఏకిపారేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఎంపీగా ఉండటం ప్రజల కర్మ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, బెస్ట్ పార్లమెంట్ జోకర్ అని ఇంకొకరు కామెంట్ చేశారు.