కోటరీకే నామినేటెడ్ కిరీటం!
కాంగ్రెస్ పార్టీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల రాజకీయం తారస్థాయికి చేరిం ది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించి, 2024 జూలైలో 37 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివిధ విడుతల్లో సంక్షేమ, కుల ఆధారిత ఫెడరేషన్లను భర్తీ చేస్తూ వచ్చిం ది. అయినా రాష్ట్రస్థాయి బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీలు, వ్యవసాయ మారెట్ కమిటీలు వంటివి ఇంకా 75కు పైగా నామినేటేడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
- 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు
- సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చర్చలు
- మాజీ చైర్మన్లలో కొందరికే మరోసారి అవకాశం
- ఆధిపత్య వర్గాలకే పదవుల భర్తీలో అధిక ప్రాధాన్యం
- ‘సామాజిక న్యాయం’ నినాదానికే పరిమితం
- త్వరలోనే కొత్త జాబితా విడుదలకు రంగం సిద్ధం
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల రాజకీయం తారస్థాయికి చేరిం ది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించి, 2024 జూలైలో 37 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివిధ విడుతల్లో సంక్షేమ, కుల ఆధారిత ఫెడరేషన్లను భర్తీ చేస్తూ వచ్చిం ది. అయినా రాష్ట్రస్థాయి బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీలు, వ్యవసాయ మారెట్ కమిటీలు వంటివి ఇంకా 75కు పైగా నామినేటేడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ప్రాథమికంగా కసరత్తు పూర్తిచేశారని తెలిసింది. గతంలో నామినేటెడ్ పదవుల్లో నియమించిన వారిలో కొందరు సమర్థంగా పనిచేసి పార్టీ బలోపేతానికి తోడ్పడగా, మరికొందరు నామమాత్రంగా మిగిలిపోయారని అధిష్ఠానం వద్దకు నివేదికలు చేరాయట. దీంతో కొత్తగా భర్తీ చేయబోయే పోస్టుల్లో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికే తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇలాంటివారు పది మందిలోపే ఉంటారని అంటున్నారు. వారిని కీలక బాధ్యతల్లో కొనసాగించడం లేదా ఉన్నతస్థాయి కమిషన్లలోకి బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు చూపని వారి స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గాంధీభవన్ నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల వరకు పెద్ద ఎత్తున లాబీయింగ్ సాగుతున్నదని గాంధీభవన్‌లో చెప్పుకొంటున్నారు.
తన విధేయులకే పట్టం కట్టేలా..
నామినేటెడ్ పోస్టులకు 2024 జూలై నాటి జీవోల ప్రకారం రెండేండ్ల కాలపరిమితితో పదవులు పొందారు. వాటిని తిరిగి భర్తీ చేసే విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనితీరు సాకుతో సీనియర్లను, ఇతర గ్రూపుల నేతలను సాగనంపేందుకు వ్యూహం సిద్ధం చేశారని చెప్తున్నారు. కేవలం ముఖ్యనేత శిబిరానికి చెందిన పదిమందిలోపు నేతలకే మళ్లీ కీలక పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న నిర్మలాజగ్గారెడ్డి, క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మ న్ మెట్టు సాయికుమార్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి తదితరులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన ట్టు తెలిసింది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీని ముఖ్యనేత తన రాజకీయ పునాదిని మరింత పటిష్టం చేసుకునే అస్త్రంగా మార్చుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. విధేయులకే పదవులు దకేలా వ్యూహాత్మకంగా ప్రతిపాదనలను రూపొందించారని చెప్తున్నారు. ఇటీవల సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు భేటీ అయ్యి ఈ ప్రతిపాదనల మీదే చర్చించినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
పెరిగిన పోటీ
నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా చాంతాడంత పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ, అధికార ప్రతినిధులుగా మీడి యా వేదికలపై పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న రాచమళ్ల సిద్ధేశ్వర్, డాక్టర్ చారకొండ వెంకటేశ్, సత్యం శ్రీరంగం, కొనగాల మహేశ్, లింగం యాదవ్‌తోపాటు టీపీసీసీ నేతలు ధరావత్ వెంకన్న, బండి సుధాకర్‌గౌడ్, తిరుమలప్రగడ అనురాధ కిషన్‌రావు, లోకేశ్‌యాదవ్, ఓబీసీ సెల్ కన్వీనర్లు డాక్టర్ కేతూరి వెంకటేశ్, ధనలక్ష్మి వంటి నేతలు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు టికెట్లు త్యాగం చేసి ప్రచారంలో ముందున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని పీసీసీ నాయకత్వం ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ నేతలు తమ దరఖాస్తులను అధిష్ఠానం ముందుంచుతున్నారు.
మరోవైపు ఈ విడతలో సామాజిక సమీకరణాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన నినాదానికి అనుగుణంగా ‘జనాభాకు తగినట్టుగా ప్రాతినిధ్యం’ అనే సూత్రాన్ని నామినేటెడ్ పదవుల్లో అమలుచేయాలని ఏఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ రాష్ట్ర పార్టీ వేస్తున్న అడుగులు మాత్రం అందుకు అనుగుణంగా లేవని సీనియర్ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పదవులు దకని అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల కు ప్రాధాన్యం కల్పించడంతోపాటు కొన్ని ప్రధాన కార్పొరేషన్లను అసెంబ్లీలో గెలిచిన కీలక ఎమ్మెల్యేలకు సైతం కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్నది. గతంలో కార్పొరేషన్ల కేటాయింపుల్లో ప్రాతినిధ్యం లభించని బీసీలు, పలు ఉపకులాల నేతలు ఈసారి తమకు కచ్చితంగా న్యాయం చేయాలని గళమెత్తుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

