Harish Rao : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై చర్చలో బదులిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు మంత్రులు. నివేదికపై మాట్లాడేందుకు హరీశ్ రావు (Harish Rao) రెండు గంటలు సమయం అడుగగా స్పీకర్ కేవలం అరగంటే కేటాయించారు. అయినా సరే ఫటాఫట్ ఆయన సందేహాల్ని నివృత్తి చేస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రలు, ముఖ్యమంత్రి పదే పదే అడ్డుపడ్డారు. ఏకంగా 30 సార్లు హరీశ్ మాట్లాడుంటే ఆటంకం కలిగించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 సార్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 7 సార్లు, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు 5 సార్లు, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 4 సార్లు అడ్డుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పర్యాయాలు, రోడ్డు భవనాల మంత్రి కోమట్ రెడ్డి రెండు సార్లు హరీశ్ రావును మాట్లాడకుండా ఆటంకం కలిగించారు.
‘Every question had an answer. Every answer had only one response, Silence, Helplessness & Embarrassment’ ✊🏻
CM Revanth holds up Uma Bharti garu’s letter, Harish Rao garu answers point by point. Revanth never touches it again.
A minister wonders how there’s water at Medigadda,… pic.twitter.com/dzfaDgHY04
— Nayini Anurag Reddy (@NAR_Handle) August 31, 2025
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్‌ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ చేరుకున్నారు కేటీఆర్, హరీశ్ రావు. మహిళా మార్షల్స్‌ను ఉపయోగించి తమను అడ్డుకోవాలని చూసిన రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు కేటీఆర్.
మాజీ మంత్రి @BRSHarish అన్న మాస్ ఛాలెంజ్..🔥
బీఆర్ఎస్ హయంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని భట్టి విక్రమార్క నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ పోటీ కూడా చేయను.
మీరు మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా.?? pic.twitter.com/DY7jNroFfZ
— Harish Rao Cults (@HarishRao_Cults) August 31, 2025
ఈ సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ ప్రతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చించేశారు. కమిషన్ కాపీలను చెత్త బుట్టలో వేసి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గొంగిడి సునీత, జగదీశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.