కాంగ్రెస్‌ను రైతు వ్యతిరేకి అని ఎందుకంటారో మరోసారి ఆ పార్టీ రుజువు చేసుకొన్నది. రైతుబంధు పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్వయంగా ఈ నెల 23న ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కొత్త పథకాలు ప్రారంభించకూడదన్నది ఓ లెక్క. ఇప్పటికే ఉన్న పథకాలను మాత్రం కొనసాగించొచ్చు. ఈ విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు అమలు కాకుండా కుట్రలు చేస్తున్నది. రైతుబంధు ఐదేండ్లుగా, దళితబంధు రెండేండ్లుగా లబ్ధిదారులకు గొప్ప ఫలాలను అందిస్తున్నాయి. కానీ ఇవేవో కొత్త పథకాలు అన్నట్టుగా వీటిని అమలు చేయొద్దంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయటంపై తెలంగాణ రైతాంగం మండిపడుతున్నది.
Congress | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైంది. రైతులకు పెట్టుబడి గోస తీర్చే రైతుబంధు పథకంపై ఆ పార్టీ విషం కక్కింది. ఈ పథకాన్ని నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు రైతుబంధు సాయం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్వయంగా ఈ నెల 23న ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో రైతుబంధు పథకం ద్వారా అందించే పెట్టుబడి సాయం పంపిణీని ఆపేయాలని పేర్కొన్నారు. దీంతోపాటు దళితుల జీవితాల్లో పెను మార్పునకు దోహదపడుతున్న దళితబంధుపైనా కాంగ్రెస్ పార్టీ విషం కక్కింది. దళితబంధు పథకం అమలును కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
రైతులకు పెట్టుబడి సాయం అందకుండా కుట్ర..
రైతులకు పంట పెట్టుబడికి ఇబ్బంది రావొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతుబంధు పంపిణీ చేస్తే రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసే పరిస్థితి రాదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుబంధు పథకం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నది. రైతులు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకునేలా కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే సీజన్‌కు ముందు అందించే రైతుబంధుకు మోకాలడ్డుతున్నది.
ఎన్నికలను సాకుగా చూపుతూ.. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయానికి ఓడిగడుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయి. దీంతో మరో నెల రోజుల్లో యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించిన కాంగ్రెస్.. రైతుబంధును నామినేషన్లకు ముందు గానీ లేదా పోలింగ్ తర్వాత కానీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అంటే సీజన్‌కు ముందు రైతులకు పెట్టుబడి సాయం అందకుండా కుట్ర చేసినట్టు స్పష్టమవుతున్నది.
దళితుల అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ దళితబంధుపైనా విషం కక్కింది. దళితులు ఆర్థికంగా బలపడేందు కు ఉపయోగపడే దళితబంధును కూడా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారు స్వశక్తితో జీవించేందుకు దళితబంధుతో ఓ మార్గం చూపించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే సుమారు 40వేల మం దికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. వారంతా ఆత్మగౌరవంతో సొంత వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు.
అన్నీ తెలిసే.. కాంగ్రెస్ కుట్రలు
వాస్తవానికి ఎన్నికల నియమావళి ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొత్త పథకాలను ప్రారంభించకూడ దు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అమలు చేయొచ్చు. ఈ విష యం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉ న్న ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రె స్ పార్టీ ఈ విషయాలు తెలిసినా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. ఇ ప్పటికే ఉన్న పథకాలు అమలు కా కుండా కుట్రలు చేస్తున్నది. రైతబం ధు ఐదేండ్లుగా, దళితబంధు రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవే వో కొత్త పథకాలన్నట్టుగా కాంగ్రెస్ వీటిని అమలు చేయొద్దంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.