నీలగిరి : మునుగోడు మండలంలోని రత్తిపెళ్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ వందమంది కాంగ్రెస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ లో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారడని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అభివృద్ధి గిట్టని మోడీ ఉచిత కరెంటును తొలగించి మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ధీమాతో అనేక మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి సైదులు. వి.శంకర్, రఫిక్, పందుల మారయ్య, బోలుగురి నర్సింహ, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.