హనుమకొండ, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. పదవుల కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వత్తాసు పలుకుతున్నారని, ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న త మను పట్టించుకోవడంలేదని వారు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు.
వారు శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు హనుమకొండలో మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని దేవాలయా లు, మార్కెట్ కమిటీలు వంటి నామినేటెడ్ పదవుల్లో, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారిని కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కడియం ప్రాధాన్యమిస్తున్నారని వాపోయారు. ప దేండ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడియం అ ధికార పార్టీలో ఉండి తమను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నారని చెప్పారు.