జనగామ: జనగామ(Janagama)జిల్లా కాంగ్రెస్ పార్టీలో(Congress) వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి(Kommuri Pratap Reddy), మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంది. తాజాగా జనగామ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో(Prajapalana dinosthavam) ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమం జరుగుతుండగా కొమ్మూరికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ ఎదురైంది. డీసీసీ అధ్యక్షుడు హోదాలో అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో కొమ్మూరిని ఎలా వేదికపై కూర్చోబెడతారంటూ సత్యనా రాయణ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. ఊహించని రీతిలో సొంత పార్టీ నేతల నుంచే ఆందోళన ఎదురవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కొమ్మూరి వేదిక దిగి కింద కూర్చున్నారు. దీంతో సత్యనారాయణ రెడ్డి వర్గం శాంతించింది.