తాడ్వాయి, డిసెంబర్ 28 : ప్రభుత్వ కట్టడాల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి అక్రమంగా తరలించిన ఇసుక డంప్‌ను, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న జేసీబీని తహసీల్దార్ గిరిబాబు సీజ్ చేశారు. ఇసుకను ఎందుకు తరలిస్తున్నారని అక్కడే ఉన్న జేసీబీ యజమాని సాగర్‌ను ప్రశ్నించగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవించందర్ ఆదేశాల మేరకు డంప్ చేసినట్టు తెలిపారు. ఇసుకను తరలించేందుకు అనుమతి లేదని వాహనాన్ని సీజ్ చేయాలని సిబ్బందికి తహసీల్దార్ సూచించారు.