సారంగాపూర్, ఆగస్టు 12: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ రైతు వేదిక ఆవరణలో మంగళవారం నిర్వహించిన రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతువేదిక ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ‘జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్, జై రాహల్‌గాంధీ’ అంటూ నినదించారు. ‘ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఒరిజనల్ కాంగ్రెస్ అయితే కండువా వేసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న జగిత్యా ల రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్, బీర్పూర్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వచ్చి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించివేశారు.