భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 : కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు ఆ పార్టీ నాయకులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనపై విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా కొత్తగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకులు తలుగు అనిల్, తలుగు శాంత తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. కొత్తగూడెం ఫ్యూన్ బస్తీకి చెందిన అనిల్ 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కాగా, శాంతి 13వ డివిజన్ నుంచి ఇప్పుడు కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావులు కొత్తగూడెం తెలంగాణ భవన్లో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్లో గులాబీ పార్టీకి జోష్ పెరిగింది.