కొడంగల్/యాదగిరిగుట్ట/ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 27: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలానికి చెందిన అనంతరెడ్డి, ఎన్కెపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి తమ అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, నాయకుల వైఖరి నచ్చక, అభివృద్ధికి దోహదపడే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
సైదాపురంలో ఎమ్మెల్యే బీర్ల ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వందమంది దళిత సీనియర్ నాయకులు గురువారం యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బానోత్ సుబ్బారావు 50 మంది అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.