ఇందిరమ్మ పేరుతో కాంగ్రెస్ నాయకుడి మోసం
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు.
- ఇల్లు ఇప్పిస్తానని రూ. 50 వేలు వసూలు.. ఉన్న ఇంటిని కూల్చేసిన నిరుపేద మహిళ
- నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో వెలుగులోకి..
అచ్చంపేటరూరల్, జూన్ 18: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే కేటాయిస్తున్నారు. దీంతో అర్హులైన నిరుపేదలకు అన్యాయానికి గురవుతుండగా, కొందరు అధికార పార్టీ నేతలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నమ్మబలికి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్‌నగర్ ఉట్ల కోనేరుకు చెందిన ఎన్ శిల్ప 16వ వార్డులో పాడుపడిన ఇంటిలో జీవనం సాగిస్తున్నది.
ఎమ్మెల్యే అనుచరుడు, స్థానిక కాంగ్రెస్ నేత నల్లపు శ్రీనివాసులు నీకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, అందుకు రూ.50వేలు ఖర్చు అవుతుందని తీసుకున్నాడు. అయితే ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే భ్రమలో ఆమె ఉన్న పాత ఇంటిని కూల్చింది. తీరా మొదటి విడతలో ఆమెకు ఇల్లు మంజూరు కాకపోవడంతో ఖాళీ స్థలంలో రేకులషెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నది. ఇల్లు ఇప్పించమని సదరు కాంగ్రెస్ నాయకుడి అడిగితే ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది. ఉన్నతాధికారులైనా స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని వేడుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

