గజ్వేల్, ఆగస్టు 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెలో చాలా రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందరూ చూ స్తుండగా.. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఒకరికొకరు కాలర్లు పట్టుకొని.. పిడిగుద్దుల వర్షం కురిపించా రు. అంతటితో ఆగకుండా.. పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి డీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెసోళ్ల అంతర్గత పోరు మరోసారి బజారుకెక్కిందని పలువురు ముక్కునవేలేసుకున్నారు. గజ్వేల్ కాంగ్రెస్‌లో చాలా రోజులుగా ఎవరి కి వారే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి గాంధీభవన్ నుంచి పార్టీ నేత విశ్వనాథ్‌రెడ్డి వచ్చారు.
ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై హరిత హోటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ మాదాడి రంగారెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బండా రు శ్రీకాంత్‌రావు వర్గీయులు ఆయనకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. ఈ క్రమంలో తామే ముం దుగా స్వాగతం పలకాలని ఇరువు రూ పోటీపడ్డారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి నర్సారెడ్డి వర్గీయులు.. జశ్వంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, తిగుల్ సర్పంచ్ భానుప్రకాశ్రావులతోపాటు మరికొంత మంది పై పిడిగుద్దులు గుద్దుతూ పరుగెత్తించి తరిమికొట్టారు. నర్సారెడ్డి వర్గ్గీయుల దాడిలో గాయపడిన వారు గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌రావు ఫిర్యాదుతో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మల్లారెడ్డి, బంగారురెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్‌తోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ జాన్‌రెడ్డి తెలిపారు.