(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తెలంగాణవాదులు తప్పుబడుతున్నారు. నల్ల చొక్కాలపై స్లోగన్లతో సభలోకి రాకూడదంటూ అడ్డంకులు సృష్టించడంపై మండిపడుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను నిరసనల రూపంలో ఎత్తిచూపడం ఇప్పటిది కాదని, ఢిల్లీలో సోనియా, రాహుల్ నుంచి తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్‌లోనూ ఈ ఆందోళనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. నల్ల టీషర్టు, మాస్క్‌లపై స్లోగన్లతో పార్లమెంట్ ముందు రాహుల్ నిరసన చేస్తే కనిపించని తప్పు.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల విషయంలో ఎలా కనిపిస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను ఎస్ఎంలో పోస్ట్ చేస్తున్నారు.