జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. భూపాలపల్లిలోని ప్రధా న రహదారికి సమీపంలో 170 సర్వే నంబర్లోని విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో పాగా వేసేందుకు పెద్దకుంటపల్లికి చెందిన కాంగ్రెస్ నేత నంగావత్ నాను దాన్ని మంగళవారం ట్రాక్టర్‌తో చదును చేయించాడు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తాసిల్దార్ వై శ్రీనివాసులును వివరణ కోరగా.. ప్రభుత్వ భూమిని నంగావత్ నాను అక్రమంగా చదును చేయిస్తున్నారని తెలిపారు. ఈ స్థలాన్ని ఇప్పటికే ట్రెస్మాకు కేటాయించామని, అతని వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలని కోరినా తీసుకురాలేదని వెల్లడించారు.