Viral Video | సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల గెలిచిన అభ్యర్థులపై దాడులకు దిగగా.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబసభ్యులు ఏకంగా ఎడ్లబండిని అడ్డంపెట్టి రోడ్డునే మూసివేశారు. అంతటితో ఆగకుండా నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులపైనా దాడికి తెగబడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చంద్రకళపై బీఆర్ఎస్ అభ్యర్థి ఉజ్వల్ యాదవ్ గెలిచాడు. దీంతో చంద్రకళ భర్త, ఆమె కుటుంబసభ్యులు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. తమను ఓడించిన గ్రామస్తులపై కక్షతో తమ ఇంటి ముందు దారికి అడ్డంగా ఎడ్లబండిని పెట్టి రోడ్డును మూసివేశారు. అటువైపు నుంచి ఎవరూ వెళ్లకూడదని తీర్మానం చేశారు. ఇదే విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ఎడ్లబండిని పక్కకు తీసి రోడ్డును క్లియర్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎడ్లబండిని పక్కకు తీస్తున్న పోలీసులపై చంద్రకళ కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. ఓ కానిస్టేబుల్ను రాయితో చితకబాదారు. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారని దారి అడ్డంగా ఎడ్ల బండిని పెట్టి రోడ్డును మూసివేసిన కాంగ్రెస్ అభ్యర్థి
ఎడ్ల బండిని పక్కకు తీస్తున్న పోలీసులపై రాళ్లతో దాడి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చంద్రకళపై గెలిచిన బీఆర్ఎస్… pic.twitter.com/ZdACIgDPIy
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2025