Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ గుండాలు, రౌడీషీటర్లు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టించారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సహనం కోల్పోయి బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగాడు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు నవీన్ యాదవ్ అనుచరులు చెప్పులు చూపించి పైశాచిక ఆనందం పొందారు. కనీసం ఆడబిడ్డ అనే గౌరవం ఇవ్వకుండా ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ గుండాలకు, రౌడీషీటర్లకు వత్తాసు పలికారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించేందుకు కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రజలను తీసుకొచ్చింది. యూసుఫ్‌గూడ పరిధిలోని మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ప్రజలను మాగంటి సునీత, ఇతర నాయకులు పట్టుకున్నారు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
రౌడీ రాజ్యం
ఆడబిడ్డ మాగంటి సునీతపై చెప్పులు చూపించిన నవీన్ యాదవ్ అనుచరులు
మాగంటి సునీతపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసి కొట్టిన శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ అనుచరులు https://t.co/CPka0MXzAt pic.twitter.com/SFegRYPMmT
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించేందుకు భారీగా ప్రజలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ
యూసఫ్ గూడ పరిధిలోని మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ప్రజలను పట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర నాయకులు
అధికారుల తీరుకు నిరసనగా… https://t.co/yJT5p2R7ug pic.twitter.com/103fpNRSDD
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025