BRSV | హైదరాబాద్ : మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. విద్యార్థి నాయకుడు దశరథ్పై ఓ కాంగ్రెస్ నేత తీవ్రంగా దాడి చేశాడు. దశరథ్ ముఖంపై ఆ నాయకుడు కాలితో బలంగా తన్నాడు. దీంతో దశరథ్ ముక్కు పగిలిపోయి రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.
విద్యార్థి నాయకుడు దశరథ్ పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు
పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుద్దామని ఇంటికి వెళ్లిన విద్యార్థి నాయకుడు దశరథ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. pic.twitter.com/bFX3KWtbWP
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024