హైదరాబాద్: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జంబారాహిల్స్లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలతో కలిసి అక్కడి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆయన నివాసంలోకి వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. కాంగ్రెస్ గూండాలు బాల్కసుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో బాల్కసుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు యాదవ్, రాకేశ్ కుమార్‌తోపాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకితీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత
హైదరాబాద్ – బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/OVUSTkfkot
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024