జనగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికిపాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా సరైన గౌరవం దక్కే విధంగా చూస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాపాక రోశాలు, మెడ శ్రీను, రాపాక మహేష్, రాపాక సురేందర్, శ్రీధర్, నగేష్, మారయ్య తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో దేవరుప్పుల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, సింగరాజు పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మేకపోతుల నర్సింహులు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశం, మండల నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.