Open Inter Exams | సూర్యాపేట : హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడింది.
తనకు బదులుగా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన భూక్యా నాగమణి అనే మహిళతో పరీక్షలు రాయించుకుంటుంది. గమనించిన ఇన్విజిలేటర్ షేక్ ఉస్మాన్ ఆరా తీయగా తేజ స్కూల్ కోఆర్డినేటర్ గురువయ్య మధ్య వర్తి ద్వారా పరీక్షలు రాస్తున్నానని భూక్యా నాగమణి ఒప్పుకుంది. మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు ధీరవత్ నీలా, నాగమణి, గురవయ్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 419,420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధీరవత్ నీలా మఠంపల్లి మాజీ జడ్పీటీసీగా పని చేసింది.