Palakurthi | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రేవంత్ పరిపాలన నచ్చక సొంత పార్టీ నేతలు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో పలవురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా పాలకుర్తి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తార హస్తం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో తార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓయూ నేత పృథ్వీ రెడ్డి కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామం నుండి 120 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఝాన్సీ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని నేతలు పేర్కొన్నారు.