జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwala Dist) విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో(Road accident) కాంగ్రెస్ నేత(Congress leader) తనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ అరుణ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దయ్యలా వాగు దగ్గర కల్వర్ట్ ను అతడి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పటేల్ రామచంద్రారెడ్డికి (28) తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రామచంద్రారెడ్డితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.