Mark Zuckerberg | ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పనిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా భార్య, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తాజాగా తండ్రి బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. తన కుమార్తెకు నెయిల్ పాలిష్ (nail paint) వేశారు. అంతేకాదు.. దానిపై అందమైన డిజైన్ కూడా వేసి తన కుమార్తె ముఖంలో సంతోషాన్ని నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, జుకర్‌బర్గ్ .. ప్రిస్కిలా చాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇక గతేడాది అంటే 2023 మార్చిలో మరో పాప అరేలియా చాన్‌కు ప్రిస్సిల్లా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
Cyclonic Storm: పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం
Heart Attack | గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి.. జమ్మికుంటలో విషాదం